Yellareddypet: రాచర్ల గొల్లపల్లిలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లిలో యువకుడు వంశీ ఆత్మహత్య. సూసైడ్ నోట్ కలకలం. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్.
Yellareddypet: రాచర్ల గొల్లపల్లిలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలిలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో తన మరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఘటన అనంతరం వంశీ అంతిమయాత్రలో గ్రామస్థులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ కొండ రమేష్ డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేస్తూ, కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అదే విధంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు సాయి ప్రేమ్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.




