Peddapalli: కాట్నపల్లి వద్ద చేపల లారీ దగ్ధం, తప్పిన ప్రాణపాయం!
Peddapalli: కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై చేపల లారీలో మంటలు చెలరేగి లారీ ద దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో కిందకు దూకేయడంతో ప్రాణపాయం తప్పింది.
Peddapalli: కాట్నపల్లి వద్ద చేపల లారీ దగ్ధం, తప్పిన ప్రాణపాయం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలో చేపల లోడుతో ఢిల్లీకి బయలుదేరిన క్రమంలో రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రయాణంలో వాహనం టైర్లు తీవ్రంగా వేడెక్కి మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో లారీ ముందు భాగానికి, ఆ తర్వాత లారీ మొత్తానికి వేగంగా వ్యాపించాయి. లారీలో ఉన్న డ్రైవర్, సహాయకుడు (క్లీనర్) మంటలను గమనించి వెంటనే కిందకు దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పి, ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల ఉద్ధృతి కారణంగా రాజీవ్ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ వెంటనే అక్కడకు చేరుకుని వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.




