Ramagundam: రామగుండం వార్డు అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష

Ramagundam: రామగుండం నగర పాలక సంస్థలో వార్డు అధికారులతో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సమీక్ష. హరితహారం, చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లపై కీలక ఆదేశాలు.

VIJAY, RAMAGUNDAM
Published on: 19 Aug 2026 8:56 PM IST
Ramagundam
X

Ramagundam: రామగుండం వార్డు అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులతో నేడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ ఈ సీజన్ లో నాలుగు లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

అవసరమైన మొక్కలు , ఎరవు ,మట్టి సిద్దంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటాడానికి అనువైన ప్రాంతాలను కూడా గుర్తించాలని అన్నారు. చేయూత ఫించన్ల అర్హుల జాబితా రూపొందించడానికి ఆగస్ట్ 31, 2026 తో గడువు ముగియనున్నoదున డివిజన్ లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి సందేహాలు తీర్చడంతో పాటు ధరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.

స్వీకరించిన ధరఖాస్తులను అర్హులు నష్టపోకుండా నిర్ణీత గడువులోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. అర్హుల నుండి ఇందిరమ్మ ఇండ్ల కొరకు నిర్ణీత పత్రాలతో సహా ధరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు మెరగుపర్చడానికి భువన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

నీటి బిల్లుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డివిజన్ లలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలు , నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలు గుర్తించి సంబందిత పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎ సి పి శ్రీహరి , సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story