Godavarikhani: కాంగ్రెస్ పాలన మోసపూరితం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Godavarikhani: కాంగ్రెస్ పాలన దొంగ హామీలతో సాగుతోందని, రామగుండంలో అభివృద్ధి మాటున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు.
Godavarikhani: కాంగ్రెస్ పాలన మోసపూరితం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని: గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో BRS రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ తో కలిసి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల పాలనలో హామీలను, గ్యారంటీ లను, డిక్లరేషన్ ను నెరవేర్చలేక పోయిందని అన్నారు. BRS పాలనలో ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందాయని, నేడు సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
వృద్ధులకు, వితంతులకు 4 వేల రూపాయల ఫెన్షన్ ఊసేలేదని, విద్యార్థిని లకు స్కూటీలు, కల్యాణలక్ష్మి తులం బంగారం దేవుడెరుగు గానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన లక్ష రూపాయలు కూడా బిడ్డలను ఎత్తుకొని తీసుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూల్చడం తప్పా ఇప్పటివరకు ఒక్క కాంప్లెక్స్ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని అన్నారు.
ఎప్పుడూ నిరివిప్పిన మా ఎమ్మెల్యే వేల కోట్ల రూపాయలు తెచ్చారని చెప్పడం తప్పా అభివృద్ధి మాత్రం ఆ స్థాయిలో కనపడడం లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హైదరాబాద్ కాంట్రాక్టర్ ల జేబులు నింపుతూ అక్కడే కమిషన్ ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కాంట్రాక్టర్ లకు పనులను అప్పగిస్తూ ఇక్కడి కాంట్రాక్టర్ ల నోట్లో మన్ను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగుండం తాము స్థాపించిన వాటిని కూల్చుతూ పోతున్న ఎమ్మెల్యే తాము ప్రారంభించిన పనులను మాత్రం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బూడిద, మట్టి, ఇసుక మాఫియా బంద్ చేసి ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. ఫైలాన్ మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తీసేసినవారు మరి ఇందిరమ్మ విగ్రహం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేక పాలన, ఎమ్మెల్యే అహంకార పూరిత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీ లను, డిక్లరేషన్ లను అమలు చేయమని త్వరలోనే BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ అమూల నారాయణ, BRS నాయకులు మూల విజయారెడ్డి,బొడ్డు రవీందర్,నూతి తిరుపతి, శ్రీరామోజు మహేష్, చెలుకలపల్లి శ్రీనివాస్, జక్కుల తిరుపతి, సిగిరి రాము,దండే రవి, అల్లం ఐలయ్య, వకుళ, పూల సత్యవతి తదితరులు పాల్గొన్నారు..




