Ramagundam: జనగామలో బోర్‌వెల్ కుంగుబాటు.. ప్రజలెవరూ భయపడొద్దు!
Ramagundam: రామగుండం కార్పొరేషన్ జనగామ గ్రామంలో మహిళ నీళ్లు కొడుతుండగా బోర్‌వెల్ భూమిలోకి కుంగిపోవడంతో ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, మేయర్ మహంకాళి స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Ramagundam: జనగామలో బోర్‌వెల్ కుంగుబాటు.. ప్రజలెవరూ భయపడొద్దు!
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధి జనగామ గ్రామంలో నిన్న సాయంత్రం ఆ గ్రామంలోని మహిళా బోర్ వెల్ కొడుతున్న సమయంలో సడన్ గా బోర్ వెల్ భూమిలోకి కుంగింది. దాంతో ఆ మహిళా, ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా ఆ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామల రమేష్ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి అధికారులతో కలసి బోర్ వెల్ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి సంఘటన జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిఎం, మేయర్ లు మాట్లాడుతూ జనగామ గ్రామంలో తమ DGMS అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ వస్తున్నారని, 2025 సంవత్సరంలో ఈ గ్రామంలో నీటి లెవెల్ 5. 39 ఉందని, ఆ తర్వాత 6 నెలలకు పరీక్షలు చేస్తే ఆపైనే నీటి లెవెల్ ఉందని తేలడం జరిగిందని వెల్లడించారు.
ఇది కేవలం బోర్ వెల్ ఉన్న ప్రదేశంలో సాండ్ పక్కకు జరగడం లాంటి ఇబ్బందుల కారణంగానే సంభవించినట్లుగా అర్ధం అవుతుందని, అలాగే భూగర్భంలో బొగ్గు పొరల్లో కొన్ని సందర్భాల్లో భౌగోళిక మార్పులు ఏర్పడుతాయని అలాంటి సందర్భంలో ఈ ఘటన జరిగే అవకాశం ఉందని జిఎం తెలిపారు.
ప్రాథమిక అంచనా ప్రకారం గ్రామంలోని ఇళ్లకు, రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఇంకా లోతుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలాగే జనగామ గ్రామ అభివృధి కోసం ఒక DPR వేయించి, ఈ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వసతి కల్పనలు కృషి చేస్తామని మేయర్ తెలిపారు. ఈ విషయంగా ఈరోజు అందరు అధికారులతో జిఎం కార్యాలయంలో సమావేశం కానున్నారని వెల్లడించారు




