Peddapalli: పెద్దపల్లి పీఎస్‌లో సీసీ కెమెరాల నెట్‌వర్క్

Peddapalli: పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రారంభం.

RAJU, PEDDAPALLI
Published on: 3 Jun 2026 2:15 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి పీఎస్‌లో సీసీ కెమెరాల నెట్‌వర్క్

పెద్దపల్లి: నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆధునిక సాంకేతికతతో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి ప్రారంభించారు..

పెద్దపల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి పోలీసు అధికారులతో మాట్లాడారు.

పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీసు సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల భద్రత, విచారణల పర్యవేక్షణ, పరిపాలనా కార్యకలాపాల నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నివారణ, కేసుల దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story