Ramagundam: రామగుండం పీజీ కాలేజీ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరం
Ramagundam: రామగుండం పీజీ కాలేజీ గ్రౌండ్‌లో కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వందలాది మందికి పరీక్షలు చేశారు.
Ramagundam: రామగుండం పీజీ కాలేజీ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరం
రామగుండం: స్వచ్ఛ భారత్‌తో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్, యోగా వంటి శారీరక వ్యాయామాలకు సమయం కేటాయించాలని, ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ఈరోజు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈరోజు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ వారి సహకారంతో పీజీ కాలేజ్ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వందలాది మంది వాకర్స్, స్థానిక ప్రజలు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
నిత్యం పీజీ కాలేజ్ గ్రౌండ్‌లో వాకర్స్ టీం యొక్క ఆరోగ్య పరిస్థితులు వారి కుటుంబ సభ్యులకు .. వాకింగ్ వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్లడ్ టెస్టులు, బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని సూచించారు.
ప్రస్తుతం చాలామంది బీపీ, షుగర్ సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో నిర్వహించిన వైద్య శిబిరాల్లో విద్యార్థులు, ప్రజల్లో గుర్తించిన పలు ఆరోగ్య సమస్యల కారణంగా కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై రామగుండం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, గ్రామాల్లోనూ దశలవారీగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన సన్‌రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి కందుల సంధ్యారాణి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు
గుండబోయిన భూమయ్య,లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, కొట్టే నరేష్, జనగామ సాగర్, శిలారపు కళ్యాణ్, కోడూరి రమేష్ ,పాకాల నరసింహారెడ్డి, బండారి శ్యాం పటేల్ ,జక్కుల పద్మ ,ప్రవీణ్ ,సాతిరి గంగరాజు, , ఎరుకొండ తిరుపతి, బుంగ మహేష్, మరియు మబ్బు సాయికిరణ్, తిరుపతి, క్యాంప్ ఇంచార్జ్ రాజేందర్, కోఆర్డినేటర్ క్యాతం సతీష్ తదితరులు పాల్గొన్నారు.




