Ramagundam: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్
Ramagundam: రామగుండంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను ఏర్పాటు చేయగా, పోస్టర్‌ను గటిక విజయ్ కుమార్ ఆవిష్కరించారు.
Ramagundam: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్
రామగుండం: రామగుండం నియోజకవర్గ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో అండగా నిలిచేందుకు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు సెంటినరీ కాలనీలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసిన కందుల సంధ్యారాణిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కోచింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు 9618195407 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం నాయకులు మద్దా లింగన్న,రాష్ట్ర పెరిక సంఘం మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ,సుంకరి ఆనంద్ దాసరి మల్లేశం మరియు పెద్దపల్లి జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు దుండె మల్లేష్ , కార్పొరేషన్ అధ్యక్షులు పోతరాజుల అంజయ్య గోవిందుల ఆనంద్ ,సెంటినరీ కాలని అధ్యక్షులు ఉగ్గె కుమార్, కందుల సదయ్య,బత్తుల రమేష్, దుండే రవీందర్, బుద్దే ఉదయ్, చింతం కిరణ్ దొమ్మెటి రవీందర్ అంకతి నాగన్న, ఉగ్గే కొమురయ్య, ప్రవీణ్, నవీన్,బేగంపేట ఉపసర్పంచ్ సందేల రేణుక - కుమార్, కొట్టే భూమన్న, బుద్దే శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు..




