Ramagundam: దీక్షా దివస్ సభకు చలో అలుగునూరు కోరుకంటి చందర్ పిలుపు
Ramagundam: నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగే కేసీఆర్ దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
Ramagundam: దీక్షా దివస్ సభకు చలో అలుగునూరు కోరుకంటి చందర్ పిలుపు
రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
శనివారం శ్రీమయి లగ్జరీ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని పేర్కొన్నారు.
నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రామగుండం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దీక్షా దివస్ సభకు రామగుండం నుంచి భారీగా తరలింపు..
ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ వద్ద రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు సమీకరించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. అక్కడ అందరూ ఒకచోట చేరిన అనంతరం సమిష్టిగా కరీంనగర్ అలుగునూరులో జరిగే సభకు బయలుదేరాలని కోరారు.
ఈ సమీకరణకు సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరుకావాలని చందర్ విజ్ఞప్తి చేశారు.
రామగుండం నుంచి బీఆర్ఎస్ శ్రేణులంతా ఒకచోట సమీకరమై దీక్షా దివస్ సభకు కలిసి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.




