Ramagundam: కుట్టు మిషన్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ మగువ బృందం

Ramagundam: గోదావరిఖని శారదా నగర్‌లో లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షురాలు అర్చన జన్మదిన వేడుకల సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

Shireesha
Published on: 28 Nov 2026 7:32 PM IST
Ramagundam
X

Ramagundam: కుట్టు మిషన్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ మగువ బృందం

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం – మగువ అధ్యక్షురాలు లయన్ అర్చన సంతోష్ రావు అంబటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, లయన్స్ మగువా ఆధ్వర్యంలో గోదావరిఖని శారదా నగర్‌లో నీ విశ్వహిత సేవా ట్రస్ట్ సేవా సమితి ద్వారా కుట్టు శిక్షణను అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం – మగువ పాల్గొని విజయవంతం చేశారు, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఉన్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ లో పాల్గొన్నారు.

మహిళలు కుట్టు శిక్షణ పొంది స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మహిళలు తమలోని నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని, స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు తోడ్పడే ఇలాంటి సేవా కార్యక్రమాలను గతంలో కూడా ఇదే ట్రస్ట్‌కు కుట్టు మిషన్లను అందించడం కాకుండా, భవిష్యత్తులో కూడా మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం – మగువ అధ్యక్షురాలు అర్చన – సంతోష్ రావు అంబటితో పాటు భవాని, గాలి సునీత, బీనా సింగ్, శశికళ, జ్యోతి, అయోధ్య రవి, VHP కార్యదర్శి సంపత్, రవీందర్, లింగన్న, లలిత, తిరుమల, వీణ, జలంధర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. విశ్వహిత సేవా ట్రస్ట్ నిర్వాహకులు కూడా పాల్గొన్నారు.

Shireesha

Shireesha