Ramagundam: ముంబై ప్రపంచ మేయర్ల సదస్సులో పాల్గొన్న మేయర్ మహంకాళి స్వామి!
Ramagundam: ముంబైలో బుధవారం నిర్వహించిన మూడో ప్రపంచ మేయర్ల సదస్సులో రామగుండం మేయర్ మహంకాళి స్వామి పాల్గొని పట్టణాభివృద్ధి, డిజిటల్ పాలనపై చర్చించారు.
Ramagundam: ముంబై ప్రపంచ మేయర్ల సదస్సులో పాల్గొన్న మేయర్ మహంకాళి స్వామి!
Ramagundam: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని ముంబాయి( మహా రాష్ట్ర ) లోని ఫెయిర్ మౌంట్ హోటల్ లో బుధవారం నిర్వహించిన మూడవ ప్రపంచ మేయర్ల సదస్సులో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సదస్సును ప్రారంభించగా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ , ముంబాయి మేయర్ రీతూ థావ్డే, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ది శాఖామంత్రులతో పాటు ముప్పది రెండు దేశాలకు చెందిన పలు నగరాల మేయర్ లు ఈ సమావేశానికి హాజరయ్యారని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి తనతో పాటు కరీం నగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, మహబూబ్ నగర్ మేయర్ గుమ్మళ్ల మమత హాజరయ్యారని ఆయన తెలిపారు.
రాబోయే 2047 నాటికి నగరాలు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెంపొందించుకోవడం , రవాణా-ఆధారిత వృద్ధి, డిజిటల్ పాలన, , డేటా-ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం , చెత్త సంక్షోభం పరిష్కరించుకోవడం, నదీతీరం పునరుద్ధరణ . పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థల పరిపాలనను బలోపేతం చేయడం, భవిష్యత్ నగరాల రూపకల్పన, ఆధునిక పాలనా విధానాలు వంటి అంశాలపై సదస్సులో చర్చ జరిగిందని తెలిపారు. వివిధ నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునేందుకు ఈ ప్రపంచ వేదిక దోహదపడిందని మేయర్ పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించి, సహకరించిన నగర ప్రజలకు ,ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కు మేయర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా నగర పాలక సంస్థ 53 వ డివిజన్ గట్ల రమేష్ కూడా మేయర్ వెంట ఉన్నారు.




