Kalva Srirampur: సైబర్ మోసగాళ్ల నుంచి తప్పించుకోవడం ఎలా? పోలీసుల స్పెషల్ క్లాస్!

Kalva Srirampur: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జఫర్‌ఖాన్ పేటలో పోలీసు కళాబృందం అవగాహన సదస్సు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 11 May 2026 7:10 AM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: సైబర్ మోసగాళ్ల నుంచి తప్పించుకోవడం ఎలా? పోలీసుల స్పెషల్ క్లాస్!

​కాల్వ శ్రీరాంపూర్: సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం మరియు మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (IPS) గారి ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జఫర్‌ఖాన్ పేట గ్రామంలో పోలీసు కళాబృందం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ హాజరై గ్రామస్తులకు సైబర్ నేరాలు మూఢనమ్మకాలు, ట్రాఫిక్ రూల్స్ తదితర సూచనలు చేశారు.

​ఆటపాటలతో చైతన్యం:

​సాధారణ ప్రసంగాల కంటే భిన్నంగా, పోలీసు కళాబృందం తమ ఆటపాటలు, జానపద గేయాలు మరియు నాటికల ద్వారా గ్రామస్తులను ఆకట్టుకుంటూనే సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.

​సైబర్ నేరాలపై అప్రమత్తత: తెలియని వ్యక్తులకు ఓటిపి (OTP)లు చెప్పకూడదని, నకిలీ లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

​గంజాయి రహిత సమాజం: యువత గంజాయి వంటి దురలవాట్లకు లోనై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, మత్తు పదార్థాల విక్రయం లేదా రవాణా గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

​మూఢనమ్మకాల నిర్మూలన: చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను నమ్మి అమాయకులపై దాడులు చేయవద్దని, అశాస్త్రీయ పోకడలను నమ్మవద్దని కళాబృందం హితవు పలికింది.

​ప్రజా భాగస్వామ్యం:

​ఈ చైతన్య కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం ప్రతినిధులు, యువతీ యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరరహిత సమాజ స్థాపనకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి జోత్స్న శ్రీనివాస్, గ్రామ పోలీసు అధికారి రామగిరి శ్రావణ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు....

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story