Ramagundam: రామగుండం ఎన్టీపీసీలో ఘనంగా విజయదశమి వేడుకలు
Ramagundam: రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో ఘనంగా దసరా వేడుకలు. శ్రీ హనుమాన్ అకాడ విద్యార్థుల సాహస విన్యాసాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్.
Ramagundam: రామగుండం ఎన్టీపీసీలో ఘనంగా విజయదశమి వేడుకలు
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో విజయదశమి, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు కంది రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన శ్రీ హనుమాన్ అకాడ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అకాడ ప్రదర్శనను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అకాడ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన కత్తిసాము, కర్రసాము, డాల్, తల్వార్, స్టార్ తదితర సాహస విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన పోరాట కళలు, క్రమశిక్షణ, ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు.
గత కొద్ది రోజులుగా విద్యార్థులకు కంది నాగరాజు ఉచితంగా శిక్షణ అందించి ఈ ప్రదర్శనకు సిద్ధం చేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కంది నాగరాజు చంద్రయ్య ను అభినందించారు. సంప్రదాయ యుద్ధ కళలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కంది ఆంజనేయులు, ముత్యాల సాయిరాం, కంది వెంకటేష్, రవి, యాదగిరి, కలవేని శ్రీకాంత్, కంది సాయి చరణ్, కంది రణధీర్, శ్రీ రాజ్, ప్రక్షేఎ స్ఫూర్తి, సిరివెన్నెల, శివాని, మహదేవ్, మహత్ సామ్రాట్, గిరి చరణ్, విశ్వ జస్వంత్, రామ్ చరణ్, శ్రీ సాయి, నిమ్మ రాజుల అఖిర, నందన్, వర్షిత్, జస్విక, మిధున, మోక్షిత్, ధీరజ్, రిషిక తదితరులు పాల్గొన్నారు.




