Metpally: తొలి కాన్పులోనే ఒక బాబు ఇద్దరు పాపలు జననం సంతోషంలో దంపతులు!

Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఒక మహిళ ముగ్గురు పిల్లలకు (ఒక బాబు, ఇద్దరు పాపలు) జన్మనిచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Aug 2026 11:25 AM IST
Metpally
X

Metpally: తొలి కాన్పులోనే ఒక బాబు ఇద్దరు పాపలు జననం సంతోషంలో దంపతులు!

Metpally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందో తల్లి. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

మండలంలోని రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్టుపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.

​పుట్టిన వారిలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు.

​బాబు బరువు: 1.8 కేజీలు

​మొదటి పాప బరువు: 1.5 కేజీలు

​రెండో పాప బరువు: 1.4 కేజీలు

​ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో, పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

​మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు, బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story