Karimnagar: మానకొండూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి అరాచక పాలన!
Karimnagar: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గన్నేరువరం డబుల్ రోడ్డు కోసం దీక్ష.
Karimnagar: మానకొండూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి అరాచక పాలన!
Karimnagar: మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా మానకొండూర్ నియోజకవర్గంలో కొనసాగుతోందని మండిపడ్డారు . గన్నేరువరం డబుల్ రోడ్డు పై ప్రశ్నిస్తే యువకులను కేసులతో బయపెడుతున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని.. 1000 రోజులు గడుస్తున్న నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అన్నారు.
మానకొండూర్ లో కాంగ్రెస్ ఓటమిని అన్ని సర్వేలు తేల్చాయని.. అది తట్టుకోలేక గన్నేరువరం యువకులను ఎమ్మెల్యే టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు.
డబుల్ రోడ్డు అడిగితే కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. కేసులు తమకు కొత్త కాదని రసమయి అన్నారు. డబుల్ రోడ్డు కోసం యువజన సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిరాహార దీక్ష చేస్తానని యువజన సంఘం నాయకులకు ఇచ్చిన హామి గుర్తు చేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిరాహార దీక్షలో పాల్గొనాలని సూచించారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి స్వామి రెడ్డి,మాతంగి లక్ష్మణ్, పాశం అశోక్ రెడ్డి, నాయిని వెంకట్ రెడ్డి, సర్పంచ్ ఎలుక ఆంజనేయులు,పొన్నం అనిల్ గౌడ్,
ఎడ్ల బుచ్చిరెడ్డి,వంతడుపుల సంపత్, పాకాల మైపాల్ రెడ్డి,లింగాల లక్ష్మణ్, పోతురాజు దేవేందర్,సల్ల మహేందర్, మాదన రాజేందర్,గడ్డి రమేష్, ఏలా శేఖర్ బాబు, మాతంగి అంజయ్య, తోట మధు,బోయిని తిరుపతి, గాజ సాగర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.




