Manakondur: మానకొండూరు చౌరస్తాలో బీఆర్‌ఎస్ ధ్వజం.. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం

Manakondur: మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 8 Sept 2026 2:41 PM IST
Manakondur
X

Manakondur: మానకొండూరు చౌరస్తాలో బీఆర్‌ఎస్ ధ్వజం.. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతోపాటు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను 420 హామీలను నెరవేర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు మహిళా ఎమ్మెల్యేలు వస్తున్న సమయంలో రేవంత్ అనుసరించిన తీరును నిరసిస్తూ వినతిపత్రం సమర్పించినట్లు రసమయి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు,బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, పాకాల మహిపాల్ రెడ్డి, గంప వెంకన్న, లింగాల లక్ష్మణ్, తిరుపతి, గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story