Kalvashreerampur: రాయపేట రిజర్వాయర్‌తో ఈ ప్రాంతం సస్యశ్యామలం
Kalvashreerampur: కాల్వశ్రీరాంపూర్ మండలం రాయపేట రిజర్వాయర్‌తో 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, అసంపూర్తి పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి డిమాండ్.
Kalvashreerampur: రాయపేట రిజర్వాయర్‌తో ఈ ప్రాంతం సస్యశ్యామలం
కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపురం గ్రామ పరిధిలోని రాయపేట వద్ద రూ. 18కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ తో ఈ ప్రాంతమంతా సశ్యశ్యామలమైందని, ఈ ప్రాంత రైతులంతా సంతోషంగా ఉన్నారని ఐడీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర రైతుల నాయకుడు ఈద శంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయపేట రిజర్వాయర్ ను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్ కరకట్టతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఎస్సారెస్పీ పరిధిలోని చివరి ఆయకట్టు ప్రాంతమైన కాల్వశ్రీరాంపూర్ మండలానికి సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయని, రైతుల సమస్యలు ధృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో తాను ఐడీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్రరావులను ఒప్పించి ఈ రిజర్వాయర్ కు రూ.18కోట్లు మంజూరి చేయించినట్లు శంకర్‌రెడ్డి చెప్పారు.
గంగారం హుస్సేన్‌మియా వాగు నుండి లిప్ట్ ద్వారా రాయపేటకు నీళ్లు తరలించి అక్కడ రిజర్వాయర్ నింపినట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా సుమారు 21 చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్థుతం ఈ చెరువులు కుంటలు ఈ రిజర్వాయర్ నీటితో నిండి మత్తల్లు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 6వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని వివరించారు.
రూ.18కోట్లు మంజూరి చేయించిన ఈ ప్రాజెక్టుకు రూ.11కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓదెల మండలంలోని నాంసానీపల్లి చెరువుతోపాటు పందిళ్ల రెండు చెరువులకు పెగడపల్లి పెద్ద చెరువుకు నీళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు ఇప్పుడు వచ్చిన ఎలినినో లు ఎన్ని వచ్చినా ఇటువంటి రిజర్వాయర్లు ఉంటే పూర్తిగా కరువును అధిగమించవచ్చన్నారు రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంత రైతాంగం తో పాటు మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు .
భూగర్భ జలాలు వృద్ధి చెంది బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయని గుర్తు చేశారు. హుస్సేన్ మియా వాగును జీవనదిలా ఉంచేందుకు అధికారులు ఈ ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. కరువు కాటకాలు ఎన్ని వచ్చినా ఇటువంటి రిజర్వాయర్లు రైతులకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే విజయరామరావు ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన పనులు పూర్తి చేయించాలని అన్నారు.
డి 83 పరిధిలోని 47 ఎల్ ఉపకాల్వ ద్వారా ఈ రిజర్వాయర్‌కు ఎస్సారెస్పీ నీళ్లు నింపడానికి 87 లక్షలతో టెండర్ వేయడం జరిగిందన్నారు సమావేశంలో మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచులు బైరం రమేష్, ఆడెపు శ్రీదేవి రాజు నాయకులు బోయిని చందర్, గణపతి రెడ్డి ,నల్ల రాజిరెడ్డి, సురేష్ ,రామగుండం కుమారస్వామి ,నక్కల కొమురయ్య ,మత్స్య కార్మికులు ఉన్నారు.




