Sircilla: ఇంటర్మీడియట్ రద్దు ఆలోచనపై ప్రభుత్వం పునరాలోచించాలి: రవి గౌడ్!

Sircilla: ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు ఆలోచనపై ప్రభుత్వం పునరాలోచించి, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని బీఆర్ఎస్వీ నేత కంచర్ల రవి గౌడ్ కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 6:52 PM IST
Sircilla
X

Sircilla: ఇంటర్మీడియట్ రద్దు ఆలోచనపై ప్రభుత్వం పునరాలోచించాలి: రవి గౌడ్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై విద్యావేత్తలు, విద్యా నిపుణులు, అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టే ముందు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉన్నత విద్యకు పునాది అని, ఈ వ్యవస్థ రద్దు వల్ల విద్యాభ్యాసం, ఉన్నత విద్యా అవకాశాలపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించాలని అన్నారు.

ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కుల పరిరక్షణే బీఆర్ఎస్వీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మట్టి శ్రీనివాస్, ఆరెల్లి వినయ్, మారం కార్తికేయ పటేల్, వి. రిషి కుమార్, కె. విష్ణు, కె. సాయితేజ, బి. యశ్వంత్, కె. జశ్వంత్, వి. అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA