Jagtial: డ్రైవర్ అశోక్‌ను తీసుకోకపోతే ముట్టడిస్తాం.. సుంకే హెచ్చరిక!

Jagtial: ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్‌పై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నిరసన. వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే జగిత్యాల ఆర్టీసీ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరిక.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 26 May 2026 8:31 PM IST
Jagtial
X

Jagtial: డ్రైవర్ అశోక్‌ను తీసుకోకపోతే ముట్టడిస్తాం.. సుంకే హెచ్చరిక!

Jagtial: జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని మాట్లాడినందుకే డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై స్పందించిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, అతడిని తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే వచ్చే రెండేళ్ల పాటు అతని కుటుంబ పోషణ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ప్రకటించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం టెంపరరీ డ్రైవర్‌గా ఉన్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అశోక్‌ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి జగిత్యాల ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని సుంకే రవిశంకర్ హెచ్చరించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story