Illanthakunta: మిడ్ మానేరు నుంచి నీళ్లిచ్చి కందికట్కూర్ రైతులను ఆదుకోండి: సర్పంచ్!

Illanthakunta: మిడ్ మానేరు ప్రాజెక్టు సమీపంలో ఉన్న కందికట్కూర్ రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఇల్లంతకుంట సర్పంచ్ విజయమ్మ ప్రభుత్వాన్ని కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Oct 2026 5:19 PM IST
Illanthakunta
X

Illanthakunta: మిడ్ మానేరు నుంచి నీళ్లిచ్చి కందికట్కూర్ రైతులను ఆదుకోండి: సర్పంచ్!

ఇల్లంతకుంట: భూములు, నివాసాలను కోల్పోయి మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన కందికట్కూర్ రైతులకు నేడు సాగునీటి కష్టాలు తప్పడం లేదని గ్రామ సర్పంచ్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు సమీపంలోనే ఉన్నప్పటికీ, తమ పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నా కందికట్కూర్ రైతుల భూములకు సాగునీరు అందకపోవడం బాధాకరమని అన్నారు.

పొలం దున్ని, పెట్టుబడులు పెట్టి, రేయింబవళ్లు కష్టపడుతున్న రైతులకు పంట చేతికొచ్చే సమయంలో నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని విజయమ్మ తెలిపారు. వానలపై ఆశలు పెట్టుకుని సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రైతులకు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చివరి దశలో ఉన్న ప్రస్తుత సమయంలో సాగునీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, నివాసాలను త్యాగం చేసిన కందికట్కూర్ రైతుల పరిస్థితిని జిల్లా అధికారులు గుర్తించాలని సర్పంచ్ విజయమ్మ కోరారు. పంట చివరి దశలో ఉన్నందున మిడ్ మానేరు నుంచి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్నం పెట్టే రైతన్నల కష్టాలను గుర్తించి, వారి కన్నీళ్లు తుడిచేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA