Karimnagar: చింతకుంట కెనాల్‌లో నీరు విడుదల చేయాలి: గంగుల కమలాకర్

Karimnagar: వినాయక నిమజ్జనాల దృష్ట్యా చింతకుంట కెనాల్‌లోకి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 15 Sept 2026 7:35 PM IST
Karimnagar
X

Karimnagar: చింతకుంట కెనాల్‌లో నీరు విడుదల చేయాలి: గంగుల కమలాకర్

కరీంనగర్: వినాయక నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌లో నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి చింతకుంట కెనాల్‌ వద్ద నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల లేకపోవడంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. దాదాపు 700 నుండి 800 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. నీటి విడుదల కోసం అక్కడి నుంచే ఎస్సారెస్పీ సీఈ సుమతితో ఫోన్‌లో మాట్లాడారు. కనీసం 1500 వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి అడ్డుకట్ట వేయడం ద్వారా 10–12 అడుగుల మేర నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు.

రెండు, మూడు రోజుల్లో నీరు విడుదల చేయాలి

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్‌లో వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. చింతకుంట, కొత్తపల్లి, మానకొండూరు నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తే ఏర్పాట్లు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో నగర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ వైస్‌ ఎంపీపీ తిరుపతి నాయక్‌, కార్పొరేటర్‌ గడ్డి ప్రదీప్‌, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, డివిజన్‌ వాసులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR