Karimnagar: ముసాయిదా జాబితాలో పేరు లేని ఓటర్లకు ఊరట.. ఈసీ మరో అవకాశం!

Karimnagar: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయిన అర్హులకు ఈసీ మరో అవకాశం కల్పించిందని కరీంనగర్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Nov 2026 9:16 PM IST
Karimnagar
X

Karimnagar: ముసాయిదా జాబితాలో పేరు లేని ఓటర్లకు ఊరట.. ఈసీ మరో అవకాశం!

కరీంనగర్: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయిన అర్హులైన ఓటర్లకు భారత ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని కల్పించిందని, తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లను నమోదు చేసుకునే వీలుందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ), నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది.

ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ ప్రక్రియ నేపథ్యంలో ఏఎస్ డీడీ జాబితాలో అర్హుల ఓటర్ నమోదు, ఎన్యూమరేషన్ ఫాంల పంపిణీ, స్వీకరణ, ఆన్ లైన్ నమోదు ప్రక్రియ, ప్రజలకు అవగాహన తదితర అంశాలపై రాజకీయ పార్టీలతో చర్చించారు. పార్టీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ​ఏఎస్‌డీడీ జాబితా లో అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని తెలిపారు. గత డ్రాఫ్ట్ జాబితాలో లేని దాదాపు లక్ష మంది ఓటర్లకు బిఎల్ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలను అందించి వెను వెంటనే దరఖాస్తును నింపించి స్వీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతి నిధులు సంబంధిత ప్రక్రియ పై ప్రజలకు మీ ద్వారా డివిజన్ వారిగా అవగాహన పరిచి... ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్కునేలా సహకరించాలని కోరారు. గతంలో ఎన్యుమరేషన్ ఫారాలు జారీ చేసినప్పటికీ, ఏఎస్ డీడీ జాబితా లో గుర్తించబడి ముసాయిదా జాబితాలో పేరు కోల్పోయిన అర్హులైన ఓటర్లు తిరిగి మల్లీ నమోదు చేసుకోవచ్చని కమీషనర్ స్పష్టం చేశారు.

ఇట్టి అవకాశంను అర్హత గల ఓటర్లు సద్వినియోగం చేస్కోవాలని పిలుపు నిచ్చారు. బిఎల్ఓలు, సూపర్ వైజర్ల ద్వారా దరఖాస్తు ఫారాలను నవంబర్ 30 వ తేది వరకు ఇంటింటికి తిరిగి, వివరాలు వెంటనే పూరించిన తర్వత స్వికరించడం జరుగుతుందని తెలిపారు. కావుల ఏఎస్ డీడీ జాబితా ఓటర్లు మీ మొక్క అడ్రస్ లలో అందుబాటులో ఉండి అర్హులైన వారు తప్పకుండా ఓటరుగా నమోదు చేస్కోవాలన్నారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, లోపాలు లేకుండా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సహకరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కోరారు.అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తుది జాబితాలో పేరు చేర్చుకునే అవకాశాన్ని కోల్పోకుండా బిఎల్ఓ సూపర్ వైజర్లు చూసేలా ఆదేశించినట్లు తెలిపారు.

ఇందు కోసం రాజకీయ పార్టీల భూత్ స్థాయి ఏజెంట్లను సమన్వయం చేస్కుంటూ... ఇంటింటికి వెల్లేలా చర్యలు తీస్కోవాలని అధికారులకు ఆదేశించారు. పొరుగువారితో పాటు కుటుంబ సభ్యులు, స్థానిక సంక్షేమ సంఘాల ద్వారా సమాచారం సేకరించి ఓటర్లను సంప్రదించాలని సూచించారు. ఈ నమోదు ప్రక్రియలో ఎక్కడా నకిలీ ఓట్లు చేరకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సత్తినేణి శ్రీనివాస్, ముసుగు మోహన్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ అలీ, వాసుదేవ రెడ్డి, ఎమ్మార్వోల రాజేష్, ఆర్ వి లక్ష్మీ అధికారులు సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN