Kalva Srirampur: ఊరంతా సుభిక్షంగా ఉండాలి.. పెగడపల్లి వేడుకల్లో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్!

Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ కొలుపు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 May 2026 4:09 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: ఊరంతా సుభిక్షంగా ఉండాలి.. పెగడపల్లి వేడుకల్లో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్!

Kalva Srirampur: పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్..... పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ కొలుపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటితో ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి గౌడ కులస్తులు బోనాల సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య శివశక్తులనుత్యాల మధ్య పురవీధుల గుండా పోచమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు,గ్రామ దేవత పోచమ్మ తల్లి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షులు గోపగోని రాజయ్య, డైరెక్టర్లు గోపగోని సమ్మయ్య, గోపగోని శ్రీనివాస్, గోపగోని సదయ్య, గట్టు రమేష్,గట్టు సదయ్య, బొంగుని శ్రీనివాస్, గోపగోని శ్రీనివాస్, గౌడ సంఘ కులస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story