Sircilla: సిరిసిల్ల పోలీస్ గ్రీవెన్స్ డే: 16 ఫిర్యాదుల స్వీకరణ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ మహేష్ బి.గితే స్వయంగా 16 ఫిర్యాదులు స్వీకరించి ఆదేశాలు జారీ చేశారు.
Sircilla: సిరిసిల్ల పోలీస్ గ్రీవెన్స్ డే: 16 ఫిర్యాదుల స్వీకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితుల నుంచి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి వినతులను స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చట్టప్రకారం న్యాయం చేయాలని సూచించారు.
గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ మహేష్ బి.గితే వెల్లడించారు.




