Dharmaram: కార్మికుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: ఓరెం చిరంజీవి!

Dharmaram: ధర్మారం మండల కేంద్రంలో భవన నిర్మాణ, టైల్స్ కార్మికులను టీఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఓరెం చిరంజీవి గురువారం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

RAMESH, DHARMPURI
Published on: 26 Nov 2026 6:59 PM IST
Dharmaram
X

Dharmaram: కార్మికుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: ఓరెం చిరంజీవి!

ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు, టైల్స్ మరియు మార్బుల్స్ యూనియన్ కార్మికులను టిఎఫ్‌టియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఓరెం చిరంజీవి కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి కార్మికుడి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, హక్కుల పరిరక్షణే తమ పోరాటమని అన్నారు.

77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల హక్కుల కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. 8 గంటల పని విధానం అమలులో ఆయన పోషించిన కీలక పాత్రను కొనియాడారు.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం కార్మికుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI