Thimmapur: భార్య స్మృత్యర్థం ZPHS పాఠశాలకు రూ.52 వేల ఫ్రిజ్ వితరణ!
Thimmapur: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి ZPHS పాఠశాలకు రూ.52,000 విలువైన రిఫ్రిజిరేటర్ వితరణ చేసిన రిటైర్డ్ టీచర్ గడ్డం మనోహర్ కుమార్.
Thimmapur: భార్య స్మృత్యర్థం ZPHS పాఠశాలకు రూ.52 వేల ఫ్రిజ్ వితరణ!
Thimmapur: రిటైర్డ్ ఉపాధ్యాయులు గడ్డం మనోహర్ కుమార్ తమ సతీమణి స్వర్గీయ శ్రీమతి గడ్డం రమ గారి స్మారకార్థంగా రూ.52,000 విలువైన రిఫ్రిజిరేటర్‌ను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు అందజేశారు.
సేవాభావం పాఠశాల అభివృద్ధికి ఎంతో దోహదపడనుండగా, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , విద్యార్థులు గడ్డం మనోహర్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
సమాజ సేవ పట్ల వారి నిబద్ధత మరియు విద్యారంగానికి అందిస్తున్న సహకారం ఇతరులకు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు.
Next Story




