Sircilla: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి: తోట ఆగయ్య
Sircilla: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు.
Sircilla: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలి: తోట ఆగయ్య
సిరిసిల్ల: శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దౌర్జన్య, అరాచక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల దాడి ఘటనను తోట ఆగయ్య ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ 14 ఏళ్ల పాటు రాజీలేని పోరాటం చేసి తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. రేవంత్‌రెడ్డి పాలన వద్దనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమని గూడూరు ప్రవీణ్ ఆరోపించారు. శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బొల్లి రామ్మోహన్, మీసరగండ్ల అనిల్ కుమార్, కుంబాల మల్లారెడ్డి, రాజు, మ్యాన రవి, బాలమల్లు, సాయికుమార్, కందుకూరి రామగౌడ్, అనిల్ గౌడ్, మొగిలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




