Karimnagar: లాల్ బహదూర్ శాస్త్రికి కరీంనగర్‌లో ఘన నివాళి: కలెక్టర్

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ చిత్రా మిశ్రా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Oct 2026 7:21 PM IST
Karimnagar
X

Karimnagar: లాల్ బహదూర్ శాస్త్రికి కరీంనగర్‌లో ఘన నివాళి: కలెక్టర్

కరీంనగర్: నిరాడంబరత, నిజాయతీతో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం ఇప్పటికి ప్రజల్లో స్ఫూర్తి నింపుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఏవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN