Kummarikunta: కుమ్మరికుంటపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి కదలిక!

Kummarikunta: హయత్ నగర్ పరిధిలోని కుమ్మరికుంట వద్ద రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో.

AJAY, HAYATH NAGAR
Published on: 18 Aug 2026 1:54 PM IST
Kummarikunta
X

Kummarikunta: కుమ్మరికుంటపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి కదలిక!

Kummarikunta: ఉమ్మడి హయత్‌నగర్ డివిజన్‌ అభివృద్ధిలో భాగంగా కుమ్మరికుంటపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యాయి.టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్‌బీనగర్ ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ యాదవ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ ఈరోజు ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఐఏఎస్‌ను కలిసి కుమ్మరికుంటపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.

గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు రావడంతో, ఈరోజు ఉదయం జోనల్ కమిషనర్‌తో పాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు కుమ్మరికుంట ప్రాంతాన్ని సందర్శించి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన నిర్వహించారు.

ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగి, ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు తెలిపారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story