Peddapalli: రాఘవాపూర్‌లో సల్మాన్‌పై దాడి ఆరోపణలు.. కలకలం

Peddapalli: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో సల్మాన్‌పై దాడి ఆరోపణలు, సీసీ కెమెరాల తొలగింపు అంశం కలకలం రేపగా, రాజకీయ కుట్రలపై మాజీ సర్పంచ్ వెంకటేష్ స్పందించారు.

RAJU, PEDDAPALLI
Published on: 25 Oct 2026 7:55 PM IST
Peddapalli
X

Peddapalli: రాఘవాపూర్‌లో సల్మాన్‌పై దాడి ఆరోపణలు.. కలకలం

Peddapalli: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన సల్మాన్‌పై దాడి జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

రెండు రోజుల క్రితం తనపై దాడి చేసి.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామంటూ కళ్లేపెల్లి అశోక్, నవీన్ అనే వ్యక్తులు బెదిరించారని సల్మాన్ మీడియాకు వెల్లడించాడు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ తెలియాల్సి ఉంది.

మరోవైపు.. గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని సల్మాన్ పేర్కొన్నాడు. వారి ఇళ్లకు వెళ్లి కలిసి భోజనం చేసేంత సాన్నిహిత్యం ఉందని తెలిపాడు. కొందరు వ్యక్తుల కారణంగానే గ్రామంలో వివాదాలు పెరుగుతున్నాయని ఆరోపించాడు.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తనపై, ఎమ్మెల్యేపై, పోలీసు అధికారిపై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామంలో సీసీ కెమెరాల తొలగింపు అంశం కూడా వివాదంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, సీసీ కెమెరాల తొలగింపునకు గల కారణాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

రాఘవాపూర్‌లో నెలకొన్న వివాదంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్థానికంగా చర్చ జరుగుతోంది. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ కోరుతున్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI