Manthani: మంత్రి శ్రీధర్ బాబు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన గ్రామస్తులు!
Manthani: మంథని మండలం నాగేపల్లి నుంచి వెంకటాపూర్ రోడ్డుకు రూ.11.72 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యాయి.
Manthani: మంత్రి శ్రీధర్ బాబు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన గ్రామస్తులు!
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగేపల్లి మెయిన్ రోడ్డు నుండి స్వర్ణవల్లి, వెంకటాపూర్ వరకు గల రోడ్డు నిర్మాణానికి సింగరేణి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) నిధుల నుండి రూ. 11 కోట్ల 72 లక్షల నిధులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు చొరవతో మంజూరు కావడం పట్ల గ్రామస్తులు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.
గ్రామస్థుల కోరిక మేరకు ఈ రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు పాటు ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం నాగేపల్లి మెయిన్ రోడ్డు వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుమ్మడి సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మంథని సత్యం, మాజీ మండల యూత్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ , మాజీ ఎంపీటీసీ బానయ్య, మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి , కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, కొండ మహేందర్, మండల యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, పర్శవేన మోహన్ యాదవ్, బెజ్జంకి మల్లయ్య బొమ్మ సత్తిరెడ్డి, రమేష్ కాపురపు రమేష్, కొప్పుల చంద్రయ్య, అక్కపాక సదయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.




