Sircilla: పదిర ఎల్లమ్మ తల్లి ఆలయ షెడ్డు పనులు ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.5 లక్షలు మంజూరు చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 11:35 AM IST
Sircilla
X

Sircilla: పదిర ఎల్లమ్మ తల్లి ఆలయ షెడ్డు పనులు ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న షెడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ బోనాల మన్నెమ్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్రం, బుగ్గారెడ్డి, బోనాల సాయి కుమార్, నరేష్, పరశురాం, గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన బండి సంజయ్ కుమార్‌కు గౌడ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA