Karimnagar: దుర్షెడ్ గ్రామంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎమ్ చోరీ!

Karimnagar: దుర్షెడ్ గ్రామంలో గ్యాస్ కట్టర్‌తో ఎస్‌బీఐ ఏటీఎమ్ ధ్వంసం. రూ. 8.85 లక్షలు అపహరణ. కేసు నమోదు చేసి 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 21 Sept 2026 8:26 AM IST
Karimnagar
X

Karimnagar: దుర్షెడ్ గ్రామంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎమ్ చోరీ!

Karimnagar: కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్షెడ్ గ్రామ శివారులో గల SBI ATMలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదుదారు CMS Info Systems Limited, తిరుమలగిరి, సికింద్రాబాద్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని SBI ATMలలో నగదు లోడింగ్ మరియు మెయింటెనెన్స్ బాధ్యతలను తన కంపెనీ తరఫున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

దుర్షెడ్‌లోని T1BS020134105 నంబర్ గల SBI ATMలో ఇటీవల నగదు లోడ్ చేయగా, ATMలో సుమారు రూ.9,84,600/- నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

20-09-2026 తెల్లవారుజామున సుమారు 04:02 గంటలకు కంపెనీ స్టేట్ మేనేజర్ ఫోన్ ద్వారా దుర్షెడ్‌లోని ఉన్న ATMలో చోరీ జరిగినట్లు సమాచారం అందించడంతో ఫిర్యాదుదారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ATMను పరిశీలించగా, గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ATM మెషిన్‌ను ధ్వంసం చేసి, అందులో అందుబాటులో ఉన్న సుమారు రూ.8,85,100/- నగదును అపహరించినట్లు గుర్తించారు.

ఈ సంఘటన 20-09-2026 తెల్లవారుజామున సుమారు 03:40 గంటల సమయంలో జరిగినట్లు ఫిర్యాదుదారు అనుమానం వ్యక్తం చేశారు.

ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN