Karimnagar: కరీంనగర్ గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు!
Karimnagar: గురునానక్ జయంతి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు బుధవారం కరీంనగర్ గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Karimnagar: కరీంనగర్ గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు!
కరీంనగర్: సిక్కుల గురువు గురునానక్ దేవ్ జయంతిని పురస్కరించుకుని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని గురుద్వారాను సంఘ్ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, సిక్కు బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
గురునానక్ బోధనలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఐక్యతకు, ధర్మ రక్షణకు సిక్కు సమాజం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ కరీంనగర్ జిల్లా సంఘచాలకులు దురిశెట్టి నిరంజనాచారి, విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ, ప్రాంత కార్యకారిణి సదస్యులు బూర్ల దక్షిణామూర్తితో పాటు పలువురు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, సిక్కు మత పెద్దలు పాల్గొన్నారు.




