కరీంనగర్ ఆర్టీసీ సమ్మె: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊపేక్షించం - సీపీ గౌష్ ఆలం హెచ్చరిక

RTC Strike in Karimnagar: కరీంనగర్‌లో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కీలక ఆదేశాలు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. విధుల్లో చేరే డ్రైవర్లకు పూర్తిస్థాయి రక్షణ. కంట్రోల్ రూమ్ నంబర్ విడుదల.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 April 2026 8:20 AM IST
cp gouse alam
X

కరీంనగర్ ఆర్టీసీ సమ్మె: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊపేక్షించం - సీపీ గౌష్ ఆలం హెచ్చరిక

కరీంనగర్: కరీంనగర్ ‌లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టాన్ని కాపాడటం పోలీస్ శాఖకు ప్రధాన ప్రాధాన్యతగా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సమ్మెను ప్రజాస్వామ్యపరమైన హక్కుగా గౌరవిస్తున్నప్పటికీ , అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పేర్కొన్న ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి:

1) సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

2) ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

3) బస్సుల రాకపోకలు , డిపో ప్రాంతాలు , ముఖ్య కూడళ్లు , మరియు బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

4) ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా, అలాంటి వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

5) సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం , వదంతులు వ్యాప్తి చేసిన వారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని , అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

6) సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

7) శాంతి భద్రతల విఘాతం కలగకుండా సమ్మె నిర్వహించుకోవాలని ఎక్కడనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్లు చర్యలు చేపడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు మరియు వారి ఉద్యోగం పరంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారన్నారు .

8) కరీంనగర్ ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా, ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లను బెదిరింపులకు గురించేసినా వెంటనే కరీంనగర్ పోలీసు స్పెషల్ బ్రాంచి కంట్రోల్ రూమ్ నంబర్ 8712670713 కు కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story