Peddapalli: సమ్మె బాటలో ఆర్టీసీ కార్మికులు.. స్తంభించిన ప్రయాణం

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె. 54 బస్సులు డిపోకే పరిమితం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్.

SHANKAR, MANTHANI
Published on: 22 April 2026 7:20 AM IST
Peddapalli
X

Peddapalli: సమ్మె బాటలో ఆర్టీసీ కార్మికులు.. స్తంభించిన ప్రయాణం

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ సమ్మె ప్రభావంతో 54 ఆర్టీసీ బస్సులు డిపోకే పరితమయ్యాయి. డిపోలో పనిచేస్తున్న 198 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.

సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బస్ డిపో, బస్ స్టేషన్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంథనిలో సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ కార్మికులకు రావలసిన పిఆర్సి లను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా పోలీసులు మాత్రం ప్రైవేటు బస్సులను బందోబస్తు మధ్య నడిపిస్తున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story