Manthani: మంథని ఆర్టీసీ డిపోలో ఉత్సాహంగా యూనియన్ ఎన్నికల పోలింగ్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల వరకు 50 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగం.

SHANKAR, MANTHANI
Published on: 9 Oct 2026 8:24 AM IST
Manthani
X

Manthani: మంథని ఆర్టీసీ డిపోలో ఉత్సాహంగా యూనియన్ ఎన్నికల పోలింగ్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. డిపో పరిధిలో మొత్తం 178 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 7 గంటల వరకు 50 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ జేఏసీ తరఫున కేకే రెడ్డి, గంధం రమేష్ పోటీలో ఉన్నారు. మరోవైపు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ వర్కర్స్ యూనియన్ జేఏసీ తరఫున వేల్పుల చంద్రమౌళి, అబ్దుల్ ఖాదర్ బరిలో నిలిచారు.

ఆర్టీసీ ఉద్యోగులు తమకు నచ్చిన యూనియన్‌కు మద్దతుగా ఓటు వేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బస్సు డిపో వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI