Peddapalli: వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి జిల్లా ఉద్యాన అధికారి
Peddapalli: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల రైతు వేదికలో వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా ఉద్యానవన శాఖ అధికారి.
Peddapalli: వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి జిల్లా ఉద్యాన అధికారి
పెద్దపెల్లి: పాలకుర్తి మండలం రైతు వేదిక ప్రాంగణంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించిన జిల్లా ఉద్యమ వన శాఖ అధికారులు శ్యాం ప్రసాద్,ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితి దృష్ట్యా, ఈ సీజన్ మొత్తం మంచి వర్షపాతం లేదు,తద్వారా జలాశయాలు నిండే పరిస్థితి లేదు, దీని తో కాలువల ద్వారా నీటి సరఫరా, చెరువుల ద్వారా నీరు అందించే అవకాశం లేదు మరియు ప్రాజెక్టులలో నీరు చేరకపోవడం వల్ల బోర్లలో, బావులలో మోటర్లు ఎక్కువ రోజులు నడిచే పరిస్థితి ఉండదు.
ఈ నేపథ్యంలో బోర్ల క్రింద,బావుల క్రింద ఎట్టి పరిస్థితిలోనూ అతి ఎక్కువ నీరు అవసరమైన వరి పంట సాగు చేయవద్దని రైతులకు ఈ సందర్భంగా అధికారులు వివరించారు , రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి ముఖ్యంగా *తక్కువ నీటితో సాగు చేయగల పంటలు ఇవి మేలు: జొన్న, పెసలు, మినుములు, కంది,పొద్దుతిరుగుడు, నువ్వులు ,సోయాబీన్ ,ఆముదం, రాగులు. మేలు అని భావించారు. రైతులందరూ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎస్సీ, ఎస్టీ రైతు సోదరులకు ఉచిత పథకాల పై సమాచారం అందజేశారు మరియు ఎస్సీ రైతులకు మాత్రమే ఉచితంగా రాగి విత్తనాలు,*ఆరుతడి పంటలకు కలుపు తీయు యంత్రాలు / వీడర్లు రూ 2000 విలువ గలది ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు మరియు ఎస్టీ రైతులకు ఉచితంగా: ఇంటి పెరటి కూరగాయ విత్తనాల కిట్లు ఇచ్చారు.
ఎస్సీ రైతులకు ఉచిత రాగి విత్తనాలు మరియు ఆరుతడి పంటలో కలుపు తీయు యంత్రాలు / వీడర్లు రూ 2000 విలువ గలది ఉచితంగా పంపిణీ చేసిన రైతు విజ్ఞాన కేంద్రం, పెద్దపల్లి కోఆర్డినేటర్ Dr.ఓ.సంపత్, -ఆయిల్ పామ్ సాగు తో రైతుకు రెట్టింపు లాభం.జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి .శ్యాం ప్రసాద్,రైతులు "తక్కువ రోజుల్లో, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయండి" - *రామగుండం ఏ.ఎం.సీ చైర్మన్ గడ్డం తిరుపతి,నేడు పంటల పై ఎల్‌ని నో ప్రభావం గురించి వ్యవసాయ శాఖ , ఉద్యానవన శాఖ మరియు రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్... సంయుక్తంగా పాలకుర్తి రైతు వేదిక లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవనశాఖ అధికారి జి.శ్యాం ప్రసాద్, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఓ. సంపత్, రామగుండం ఏఎంసీ చైర్మన్ గడ్డం తిరుపతి, పాలకుర్తి సర్పంచ్ పెద్దపల్లి తిరుమల, ఉద్యానవన శాఖ అధికారి ఏ .జ్యోతి, హెచ్.ఈ. ఓ బి .రాము, తిరుమల ప్లాంటేషన్ ఆఫీసర్ ప్రశాంత్, ఏ .ఈ .ఓ లు ఎం. సువర్ణరేఖ, కే .శ్రీకాంత్ , జే.సుష్మ మరియు అధిక సంఖ్యలో సన్న చిన్న కారు ఎస్సీ రైతులు పాల్గొన్నారు.




