Karimnagar: శ్రవణ్ కుమార్‌కు ‘నేషనల్ సేవా ధార్మిక్ అవార్డు’ ప్రదానం!

Karimnagar: 18 ఏళ్లుగా నేత్ర, అవయవ, శరీరదానాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు టి. శ్రవణ్ కుమార్‌కు నేషనల్ సేవా ధార్మిక్ అవార్డు ప్రదానం చేశారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 11 Nov 2026 11:17 PM IST
Karimnagar
X

Karimnagar: శ్రవణ్ కుమార్‌కు ‘నేషనల్ సేవా ధార్మిక్ అవార్డు’ ప్రదానం!

కరీంనగర్‌: సేవ చేయాలనే సంకల్పం.. మరణానంతరం కూడా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయం.. ఈ లక్ష్యంతో 18 ఏళ్లుగా నేత్ర, అవయవ, శరీరదానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సదాశయ ఫౌండేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫౌండేషన్ సేవలను గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన లతా రాజా ఫౌండేషన్ ‘నేషనల్ సేవా ధార్మిక్ అవార్డు’తో సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి. శ్రవణ్ కుమార్‌ను సత్కరించింది.

కరీంనగర్‌లోని వి కన్వెన్షన్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందజేశారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం (ఐపీఎస్), ప్రముఖ సామాజిక సేవకుడు సూర్యం (గద్దర్ కుమారుడు), లతా రాజా ఫౌండేషన్ ఛైర్మన్ కె.కె. రాజా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘం ఛైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి తదితరులు శ్రవణ్ కుమార్‌ను ఘనంగా సత్కరించి అభినందించారు.

రామగుండం 8 ఇంక్లైన్ కార్మిక క్షేత్రంలో ముందడుగు వేసిన శ్రవణ్ కుమార్ నేడు సదాశయ ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా అవయవ శరీర నేత్ర దానాలపై విశేష కృషి చేస్తూ, ఎందరో బాధితుల్లో వెలుగులు అందించడంలో తమ వంతు కృషి అందజేస్తూ, నేత్రదానంతో పాటు శరీరదానాలతో వైద్య విద్య పరిశోధనకు తోడ్పడుతూ గొప్ప సామాజిక సేవలను అభినందించారు. గ్రామాలలోప్రజలు స్వచ్ఛందంగా తీర్మానాలను నిర్వహిస్తున్న సేవలు ప్రశంసిస్తూ, నేటి సమాజంలో ఎన్నో అపోహలు నడుమ మరణించినా భౌతిక దేహాన్ని, కుటుంబ సభ్యులను ఒప్పించి, నేత్రాలను , అవయవ , శరీర దానం అందించిన

ఈ అవార్డు సదాశయ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు దక్కిన గుర్తింపుగా ప్రతినిధులు పేర్కొన్నారు. పురస్కారం అందుకున్న శ్రవణ్ కుమార్‌కు ప్రతిమ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు డాక్టర్ టి.కె.కె. నాయుడు, డాక్టర్ ప్రణయ్ కుమార్‌తో పాటు సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు అభినందనలు తెలిపారు.

శ్రవణ్ కుమార్ పురస్కారం అందుకోవడం పట్ల కమాన్పూర్ లయన్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు నూక రమేష్, లింగమూర్తి, డాక్టర్ భీష్మాచారి, వాసు, రాజిరెడ్డి, చంద్రమౌళి, ఏ. రాజమౌళి, కవిత, అనంతరాములు, అన్నపూర్ణ, నరహరి, శంకర్ రావు, దళపతి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రాములు, ఎల్. రాజమౌళి, గాయకుడు వెంకన్న, సతీష్, మల్లేశం, డీలర్ వెంకన్న, రాజలింగయ్య, కనకయ్య, సుగేందర్ రావు, సారయ్య, సమ్మయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM