Odela: పోత్కపల్లి కొత్త ఎస్సైగా సనత్ కుమార్ బాధ్యతలు!
Odela: పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సనత్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.
Odela: పోత్కపల్లి కొత్త ఎస్సైగా సనత్ కుమార్ బాధ్యతలు!
పెద్దపల్లి జిల్లా: ఓదెల మండలం లోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా సనత్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎస్సైగా పనిచేసిన దికొండ రమేష్ రామగుండం కమిషనరేట్ కు బదిలీ కాగా జూలపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సనత్ కుమార్ పొత్కపల్లి స్టేషన్ కు బదిలీ అయ్యారు. బుధవారం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై సనత్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అవలంబిస్తూనే, నేరాల నియంత్రణకు ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.




