Sircilla: ఇల్లంతకుంట మండలంలో ఇసుక కొరత.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు!

Sircilla: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఇసుక కొరత వల్ల ఇందిరమ్మ ఇళ్లు, ఇతర నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 1:57 PM IST
Sircilla
X

Sircilla: ఇల్లంతకుంట మండలంలో ఇసుక కొరత.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఇసుక రవాణా సౌకర్యం లేక ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర నిర్మాణ పనులు నిలిచిపోయాయని మండల అభివృద్ధి ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఇసుక అందుబాటులో లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండల అభివృద్ధి ఐక్య వేదిక కన్వీనర్ సావనపెల్లి రాకేష్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు మండల ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు న్యాత అశోక్, ప్రదీప్ గౌడ్, ఎదిరే శ్రీనివాస్, పెద్దూరి సురేష్, కుర్ర వేణు, సావనపెల్లి పరశురాములు, రఘు, నర్సింహా, లింగన్న, వినోద్, మధు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA