Desaipally: దేశాయిపల్లెలో తృటిలో తప్పిన ఇసుక ట్రాక్టర్ ప్రమాదం!

Desaipally: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పే ప్రమాదం తృటిలో తప్పడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Sirisha
Published on: 11 Sept 2026 12:18 PM IST
Desaipally
X

Desaipally: దేశాయిపల్లెలో తృటిలో తప్పిన ఇసుక ట్రాక్టర్ ప్రమాదం!

Desaipally: రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం: దేశాయిపల్లె గ్రామంలోని ప్రధాన మూలమలుపు వద్ద ఇసుక ట్రాక్టర్ ప్రమాదం తృటిలో తప్పింది. ఇసుక లోడుతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌కు రన్నింగ్‌లోనే బంపర్, టైరు విరిగినట్లు స్థానికులు తెలిపారు.

ట్రాక్టర్ అదుపుతప్పి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా దూసుకెళ్తున్నాయని, డ్రైవర్లు వేగాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

ఈ ఘటనపై ట్రాక్టర్ డ్రైవర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించి, గ్రామాల్లో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Sirisha

Sirisha