Sircilla: సిరిసిల్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

KALEEM, SIRICILLA
Published on: 18 Aug 2026 12:22 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు!

Sircilla: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాపన్న పోరాట స్ఫూర్తిని, సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్నతో పాటు గౌడ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story