Yellareddypet: హరిదాస్ నగర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 5:10 PM IST
Yellareddypet
X

Yellareddypet: హరిదాస్ నగర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి లేదా కుటుంబం తరఫున బీమా కోసం ఎంపిక చేసుకున్న వ్యక్తి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నామినీ వివరాలు తదితర అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని గ్రామపంచాయతీలో నమోదు చేసుకోవాలని ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏ ఒక్క కుటుంబం కూడా పథకం ప్రయోజనాన్ని కోల్పోకూడదని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్కా పరశురాములు, ఏఎంసీ డైరెక్టర్ బొల్లు గంగయ్య, నారాయణ, రాములు, రాజు, రాకేష్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA