Manthani: బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సర్పంచ్ వినతిపత్రం!
Manthani: పెద్దపల్లి నుంచి గోదావరిఖని వెళ్లే ఆర్టీసీ బస్సును పెంచికల్‌పేట్ గ్రామం మీదుగా నడపాలని గ్రామ సర్పంచ్ పల్లె మాధవి-నారాయణ ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Manthani: బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సర్పంచ్ వినతిపత్రం!
మంథాని: పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వెళ్లే టీజీఎస్‌ఆర్టీసీ బస్సును పెంచికల్‌పేట్ గ్రామం మీదుగా నడపాలని కోరుతూ గ్రామ సర్పంచ్ పల్లె మాధవి-నారాయణ ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచికల్‌పేట్ గ్రామం నుంచి ప్రతిరోజూ అనేక మంది ప్రజలు పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, మహిళలు ఆర్టీసీ బస్సుల పై ఆధారపడుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం గ్రామం మీదుగా సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సును పెంచికల్‌పేట్ గ్రామం మీదుగా నడిపిస్తూ, గ్రామ ప్రజలకు అనుకూలంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను సర్పంచ్ పల్లె మాధవి-నారాయణ కోరారు. గ్రామ ప్రజల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు సానుకూలంగా స్పందించి త్వరగా బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.




