Yellareddypet: బండలింగంపల్లి సర్పంచ్ నర్సగౌడ్‌కు మహిళా సంఘాల సన్మానం!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మహిళా సంఘాల భవనాలను ఏకకాలంలో పూర్తి చేసిన సర్పంచ్ నర్సగౌడ్‌ను మహిళా సంఘాల సభ్యులు సన్మానించారు.

KALEEM, SIRICILLA
Updated on: 29 Oct 2026 2:10 PM IST
Yellareddypet
X

Yellareddypet: బండలింగంపల్లి సర్పంచ్ నర్సగౌడ్‌కు మహిళా సంఘాల సన్మానం!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మహిళా సంఘాల భవనాలను ఏకకాలంలో పూర్తి చేసినందుకు గ్రామ సర్పంచ్ నర్సగౌడ్‌ను మహిళా సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ పనుల పురోగతి సమీక్ష సమావేశంలో బండలింగంపల్లి గ్రామంలో మహిళా సంఘాల భవనాలను ఏకకాలంలో పూర్తి చేసినందుకు సర్పంచ్ నర్సగౌడ్‌ను అభినందించారు. మంత్రి సీతక్క ప్రశంసల నేపథ్యంలో స్థానిక మహిళా సంఘాల సభ్యులు సర్పంచ్ నర్సగౌడ్‌కు శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐకేపీ సీఏ లద్దునూరి రమణ యాదవ్‌తో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA