Kalva Srirampur: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి: శ్రీమాల

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల అధికారులతో సమీక్షించారు.

KONDAL, SULTANABAD
Published on: 7 Nov 2026 3:23 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి: శ్రీమాల

Kalva Srirampur: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాల అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారలు తో పాటు సర్పంచ్లు హాజరయ్యారు.

గ్రామ సమస్యలపై ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాల మాట్లాడుతూ గ్రామాలు ప్రగతి బాటలో నడవాలంటే సర్పంచ్ల కృషి ఎంతో అవసరమని అన్నారు.గ్రామాలు అభివృద్ధి చేసేందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీటి విద్య వైద్యంతో పాటు తదితర మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు.

గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సర్పంచ్లు అధికారులు చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, తాసిల్దార్ రాముడు, సూపర్డెంట్ శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్ రంగు రవి జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి టైపిస్టు లక్ష్మణ్ ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD