Karimnagar: శాతవాహన వర్సిటీలో పర్యావరణ విధ్వంసంపై TSPCBకి విద్యార్థుల ఫిర్యాదు

Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో తవ్వకాలు, చెట్ల నరికివేతపై విద్యార్థుల ఆగ్రహం. పర్యావరణ నష్టంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Nov 2026 7:27 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీలో పర్యావరణ విధ్వంసంపై TSPCBకి విద్యార్థుల ఫిర్యాదు

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న భారీ తవ్వకాలు, మట్టి తరలింపు, ఎన్నో ఏళ్ల నాటి చెట్ల నరికివేత మరియు పర్యావరణ విధ్వంసంపై విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

గాలరీ, లా కళాశాల, సింథటిక్ ట్రాక్ వంటి అభివృద్ధి పనుల పేరుతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీగా తవ్వకాలు చేపట్టి, విలువైన మట్టిని బయటకు తరలిస్తున్నారని, అదే సమయంలో పెద్ద పెద్ద వృక్షాలను నరికివేస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు.

ఈ చర్యల వల్ల క్యాంపస్‌లో దుమ్ము, శబ్ద కాలుష్యంతో పాటు సహజ పర్యావరణం, జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పక్షి నెమళ్లతో పాటు అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు తరచుగా కనిపించేవని, ప్రస్తుతం వాటి సహజ ఆవాసాలు ధ్వంసం కావడంతో వాటి ఉనికి గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) అధికారులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను సందర్శించి తవ్వకాల వల్ల కలుగుతున్న పర్యావరణ నష్టాన్ని, దుమ్ము మరియు శబ్ద కాలుష్యాన్ని పరిశీలించాలని కోరారు. సంబంధిత అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలును తనిఖీ చేసి, ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR