Karimnagar: శాతవాహన వర్సిటీలో ‘ట్యాలీ’ నైపుణ్యాభివృద్ధి కార్యశాల ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థుల కోసం మూడు రోజుల "ట్యాలీ ఈఆర్పి 9.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 15 July 2026 9:38 AM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీలో ‘ట్యాలీ’ నైపుణ్యాభివృద్ధి కార్యశాల ప్రారంభం!

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం చేపట్టిన “అకాడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. వంద రోజుల కార్యాచరణ” లో భాగంగా “కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ఈఆర్పి 9 – ఏ స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్” అనే మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యశాల జూలై 14 నుంచి 16 వరకు నిర్వహించబడుతోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాలీ ERP 9లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ నిర్వహణ, వౌచర్ ఎంట్రీ, జీఎస్టీ అకౌంటింగ్, ఇన్వెంటరీ, పేరోల్, బ్యాంకింగ్, ఆర్థిక నివేదికలు మరియు డేటా భద్రతపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పరు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక వ్యాపార రంగంలో అకౌంటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, విద్యార్థులు సంప్రదాయ పరిజ్ఞానంతో పాటు ట్యాలీ వంటి నూతన అకౌంటింగ్ సాంకేతికతలను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకున్నప్పుడే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను సమర్థవంతంగా అందిపుచ్చుకోగలరని అన్నారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, ట్యాలీ సాఫ్ట్‌వేర్‌ను త్వరలోనే విశ్వవిద్యాలయ అకౌంట్స్ విభాగంలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. వాణిజ్య శాస్త్ర అంశాలతో రూపొందించిన ఈ కోర్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, వారి ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్, ఐక్యూఏసీ డైరెక్టర్, అకాడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, ప్రాయోజిక నైపుణ్యాలు, ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందించడమే అకాడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇటువంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమ కన్వీనర్, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి,బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ డి. హరికాంత్ మాట్లాడుతూ, వాణిజ్యశాస్త్ర విద్యార్థులకు అవసరమైన సాంకేతిక, ఉపాధి ఆధారిత నైపుణ్యాలను అందించేందుకు త్వరలో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వాణిజ్యశాస్త్ర విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే విధంగా కామర్స్ స్టూడెంట్స్ మీట్ నిర్వహించేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు డా. కె. తిరుపతి, డా. బి. నరేష్, డా.బి. పరశురాములు, అధ్యాపకులు డా. ఎం. మనోజ్ కుమార్, డా. టి. కృష్ణకుమార్, శ్రీమతి సావిత్రి, అనిల్, వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story