Karimnagar: శాతవాహన వర్సిటీలో ‘రీసెర్చ్ కనెక్ట్-2026’: పరిశోధనల్లో నైతిక విలువలే ప్రాణం.. నూతన విద్యార్థులకు దిశానిర్దేశం!

Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నూతన పరిశోధక విద్యార్థుల కోసం ‘రీసెర్చ్ కనెక్ట్-2026’ కార్యక్రమం నిర్వహించారు. పరిశోధనలో నైతిక విలువలు మరియు పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 April 2026 8:38 AM IST
Karimnagar: శాతవాహన వర్సిటీలో ‘రీసెర్చ్ కనెక్ట్-2026’: పరిశోధనల్లో నైతిక విలువలే ప్రాణం.. నూతన విద్యార్థులకు దిశానిర్దేశం!
X

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్‌లోని వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా చేరిన పరిశోధక విద్యార్థులు, కొత్తగా నియమితులైన పరిశోధన మార్గదర్శకులు కోసం "Research Connect -" పరిశోదనా పరిచయం-2026" పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

"మెథా కలయిక - క్రియాశీలక విజ్ఞానం"అనే శీర్షిక న నిర్వహించిన ఈ కార్యక్రమం పరిశోధన రంగంలో నూతన ఆలోచనలను ప్రోత్సహించడం, పరిశోధకులు, మార్గదర్శకుల మధ్య సృజనాత్మక సంబంధాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.

డా. డి. హరికాంత్ మాట్లాడుతూ పరిశోధన ప్రమాణాలు, పద్ధతులు, పరిశోధనలో అనుసరించాల్సిన నైతిక విలువలపై వివరణాత్మక సందేశం ఇచ్చారు.

అధ్యాపక మార్గదర్శకులు డా. మల్లారెడ్డి, డా. హరిజౌత్ కౌర్, డా. బి. నరేష్, డా. కె. అర్జున్, డా. ఏ. సతీష్ కుమార్ పాల్గొని పరిశోధన విధానాలు, అకడమిక్ అభివృద్ధిపై మార్గనిర్దేశం చేశారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిశోధనాభివృద్ధికి కట్టుబడి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నూతన పరిశోధకులకు సరైన దిశానిర్దేశం లభించి, భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాల పరిశోధనలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story